మళ్లీ అడ్డంగా దొరికిపోయిన రాజేంద్ర ప్రసాద్.. మాజీ ప్రధానిపై వివాదాస్పద కామెంట్స్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-07 12:04:25  IST  )

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

మళ్లీ అడ్డంగా దొరికిపోయిన రాజేంద్ర ప్రసాద్.. మాజీ ప్రధానిపై వివాదాస్పద కామెంట్స్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అలాగే నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తోటి నటీనటులకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతూ చిక్కుల్లో పడుతున్నారు. పలు కామెంట్స్ వివాదాస్పదం కావడంతో ఏమీ చేయలేక క్షమాపణలు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల రాజేంద్ర ప్రసాద్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.

డేవిడ్ వార్నర్(David Warner), అలీ వంటి నటులపై చేసిన కామెంట్లు వివాదాస్పదం అయినప్పటికీ నేను అలాగే మాట్లాడుతానంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. పదే పదే నోరు జారుతూ పేరు ప్రతిష్టలను మంటగలుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇవెంట్‌లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ ఈ సారి ఏకంగా మాజీ ప్రధానిపై పలు కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డారు. ‘‘ఇది డెట్రాయిటా? లేక బెజవాడ తెలియట్లేదు ఉన్నట్టుండి ఓ వ్యక్తి అన్నా నీ వల్లే బతికేస్తున్నాం అన్నాడు.

దీంతో నేను నా వల్ల బతకడమేంటని అడిగాను. అందుకు అతను.. జీవితంపై విరక్తి కలిగినా, ఇంటికి వెళ్లిపోదామని అనిపించినా మీ సినిమాలు చూడగానే అంతా మర్చిపోతున్నాం. ఈ మాట నువ్వే కాదు.. దివంగత ప్రధాని పీవీ నరసింహరావు గారు కూడా అన్నారని చెప్పాను. ఆయన పెద్ద పెద్ద సూట్‌కేసులు, కేసులు అయితే చివరకు నా సినిమా చూసి ప్రశాంతత పొందేవారు’’ అని చెప్పుకొచ్చారు. ఒక మాజీ ప్రధాని గురించి ప్రస్తావించేటప్పుడు కేసులు అని చెప్పడం కాస్త వివాదాస్పదంగా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Next Story