'ది చెల్లో షో' ఆస్కార్ నామినేషన్‌ ఎంపికపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

by Disha Web Desk 7 |
ది చెల్లో షో ఆస్కార్ నామినేషన్‌ ఎంపికపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: 21ఏళ్ల తర్వాత బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో 'ది చెల్లో షో' 2023 ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికవడంపై రాజమౌళి స్పందించాడు. 'ఆర్ఆర్ఆర్' కూడా తప్పకుండా అకాడమీకి నామినేట్ అవుతుందని ఊహించినప్పటికీ అలా జరగకపోవడంతో 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ డైరెక్ట్‌గా నామినేషన్ కోసం పోటీ పడింది.

ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు.. 'భారత్ తరఫున 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికవకపోవడం నిరాశ కలిగించింది. అయినా దాని గురించి ఆలోచిస్తూ కూర్చునేవాళ్లంకాదు. మరింత బలంగా ముందుకెళ్తాం. ఆస్కార్స్‌కు భారతీయ చిత్రం (ది లాస్ట్ ఫిల్మ్ షో) షార్ట్ లిస్ట్ కావడం సంతోషమే. 'ఆర్ఆర్ఆర్' ఎంపికైతే గెలిచే ఛాన్సు ఎక్కువగా ఉండేది' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : సిద్దిపేట జిల్లాలో Sonu Sood విగ్రహం!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed