- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి జక్కన్న... ప్లాన్ అదుర్స్ ?
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఎన్నో రోజుల నుంచి ఈ

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఎన్నో రోజుల నుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నటించిన.. హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్, అందరినీ ఆకట్టుకున్నాయి. పిరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది.
అయితే ఈ నెల చివరలో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అలాగే... హరిహర వీరమల్లు మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా.. అతి త్వరలోనే నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈనెల 20వ తేదీన విశాఖపట్నంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఈవెంట్ కోసం నారా చంద్రబాబు నాయుడు కూడా అతిథిగా రాబోతున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వస్తారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎలాగూ త్రివిక్రమ్ వచ్చేస్తారు. అయితే త్రివిక్రమ్ తో పాటు ఇప్పుడు కొత్త పేరు తెరపైకి వచ్చింది. జక్కన్న కూడా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగుతున్నారట. త్రివిక్రమ్ తో పాటు రాజమౌళి కూడా వస్తున్నారని సమాచారం అందుతుంది. ఈ మేరకు రాజమౌళిని రావాలని.. చిత్ర బృందం కూడా కోరినట్లు తెలుస్తోంది.






