మహేశ్ బాబు‌తో కలిసి నటించనున్న రాజమౌళి.. ఏ పాత్రలో అలరిస్తాడో !

by Disha Web Desk 6 |
మహేశ్ బాబు‌తో కలిసి నటించనున్న రాజమౌళి.. ఏ పాత్రలో అలరిస్తాడో !
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులంతా ఒకెత్తు అయితే, రాజమౌళి మరో ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రతీ చిత్రంలోనూ ఊహించని స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటారు. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాల ఘనతను చాటుతుంది. ఇక జక్కన్న తన తదుపరి చిత్రం మహేశ్ బాబు‌తో చిత్రీకరించబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రాజమౌళి కూడా నటించబోతున్నట్లు తాజాగా వార్తలు వినపడుతున్నాయి.

ఇక ఈ దర్శక దిగ్గజం నటన గురించి మనకు తెలిసిందే. ‘బాహుబలి’లో ఓ చిన్న సీన్‌లో నటించి మెప్పించారు. చెప్పాలంటే జక్కన్న నటుడు కావాలనే అనుకున్నాడు కానీ.. డైరెక్టర్ అయ్యారు. దీంతో సినిమాల్లో నటించే అవకాశాలు పెద్దగా రాలేదు. కాబట్టి తన సినిమాలోనే ఒక క్యారెక్టర్ చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పడు మహేశ్ మూవీ‌లో కూడా కనిపించనున్నాడట. ఎలాంటి పాత్రలో అలరిస్తాడో చూడాలి మరి!



Next Story

Most Viewed