ఈ అవార్డు నీకెప్పుడో ద‌క్కాల్సింది: MM Keeravani కి పద్మశ్రీపై Rajamouli పోస్ట్!

by Mallepaka Hamsa |   (  Updated:2023-01-26 14:45:32  IST  )

రాజ‌మౌళి ద‌ర్శక‌త్వం వ‌హించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ పెద్ద విజయం సాధించింది..

ఈ అవార్డు నీకెప్పుడో ద‌క్కాల్సింది: MM Keeravani కి పద్మశ్రీపై Rajamouli పోస్ట్!
X

దిశ, సినిమా: రాజ‌మౌళి ద‌ర్శక‌త్వం వ‌హించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ పెద్ద విజయం సాధించింది. ఇటీవ‌లే ఈ సినిమాకు కీర‌వాణి సంగీతాన్ని అందించిన 'నాటు నాటు' పాట ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఆ సంతోషం మ‌రువ‌కముందే కీర‌వాణికి బుధవారం కేంద్ర ప్రభుత్వం ప‌ద్మశ్రీ అవార్డును ప్రక‌టించింది. దీంతో కీర‌వాణిపై రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ప్రజెంట్ అత‌డి ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 'ఈ అవార్డు నీకు ఎప్పుడో ద‌క్కాల్సింద‌ని అభిమానులు అంటున్నారు. కానీ, ఈ విశ్వాన్ని మాత్రం నువ్వు ఎప్పటికి కోల్పోకూడదు. చెప్పేది ఒక్కటే కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒక‌టి పూర్తిగా ఎంజాయ్ చేశాకా మ‌రొక‌టి ఇవ్వు. మా పెద్దన్న ఎమ్.ఎమ్ కీర‌వాణికి ప‌ద్మశ్రీ అవార్డు రావ‌డం గ‌ర్వంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి : keeravani ఎమోషనల్ ట్వీట్‌.. కొంచెం గ్యాప్ ఇవ్వు అంటూ రాజమౌళి పోస్ట్


Like many of your fans feel, this recognition indeed was long over due.

Next Story