రాజమౌళి మహేష్ బాబు మూవీ లో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో..

by Dishafeatures1 |
రాజమౌళి మహేష్ బాబు మూవీ లో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో..
X

దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్క ఆడియన్ తన సినిమాను చూసి కాలర్ ఎగరేసుకుని మరి బయటికి రావాలి. దాని కోసం ఆయన ఎంతలా కష్టపడతాడు అంటే.. సీన్స్‌ను డిజైన్ చేయడం కోసం ఎన్ని ఏళ్లు అయిన సరే కష్టపడతాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఇక అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్న ఈ మూవీ కోసం రాజమౌళి అని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా మూవీ మంచిగా రావాలి అంటే ప్రతి ఒక పాత్ర చాలా ముఖ్యం. అందులోను మహేష్ బాబుకి దీటుగా నిలబడగలిగే ప్రతి నాయకుడు క్యారెక్టర్ అంటే మాములు విషయం కాదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో విలన్ గా విలనిజాన్ని పండించే హీరో అయితే బెటర్ అని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్ తో ఈ పాత్రని చేయించాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట. ఇక ఈ క్యారెక్టర్ కోసం కొంతమంది నటులను చూసిన రాజమౌళి ఎవరితో కూడా ఈ క్యారెక్టర్‌ను పోల్చి చూసుకోలేకపోతున్నారట. హృతిక్ రోషన్ అయితేనే ఈ క్యారెక్టర్ కి 100% న్యాయం చేయగలరు అనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనికి హృతిక్ రోషన్ ఒప్పుకుంటారా లేదా ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది తెలియాలి.

Read More..

రిలీజ్ అయి రెండేళ్లవుతున్నా జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’కు తగ్గని క్రేజ్.. నెట్టింట ఫొటోలు వైరల్


Next Story

Most Viewed