- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘SSMB-29’ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. షాక్‌లో మహేష్ బాబు అభిమానులు?
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో ‘SSMB-29’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో ‘SSMB-29’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. కేఎల్ నారాయణ(KL Narayana) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే భారీ అంచనాలను పెంచింది. ‘SSMB-29’ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయినప్పటికీ రాజమౌళి ఇన్నాళ్లు షూటింగ్ కోసం ప్లేస్ వెతికే పనిలో పడి ఎలాంటి అప్డేట్ విడుదల చేయలేదు. ఇక మహేష్ బాబు మాత్రం గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా(Social Media)కు కూడా దూరం అయి కఠిన విద్యలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల రాజమౌళి ‘SSMB-29’ ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ పాస్‌పోర్ట్ లాక్కొని సింహాన్ని బంధించినట్లు తెలుపుతూ వీడియోను షేర్ చేశారు. ఇక దీనికి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) రిప్లై ఇవ్వడంతో మహేష్ బాబు(Mahesh Babu) సరసన హీరోయిన్‌గా నటిస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా ఆమె ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్‌కు కూడా వచ్చింది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి, ప్రియాంకకు కొన్ని కండీషన్స్ పెట్టడంతో ట్విస్ట్‌గా మారిందని నెట్టింట చర్చ జరుగతోంది. SSMB29 కోసం చాలా డేట్స్ ఇవ్వాలని సూచించారట.
తన సినిమా షూట్ జరిగే సమయంలో ఎప్పుడు అడిగితే అప్పుడు షూటింగ్‌కు వచ్చే వెసులు బాటు ఉండేలా డేట్స్ ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు టాక్. దీంతో ప్రియాంక డైలామాలో పడిపోయింది. దీంతో డిసైడ్ కావడానికి, డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవడానికి కొంత సమయం కోరిందట. ఇక ఈవిషయం తెలుసుకున్న వారంతా హాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఆమె ఇక్కడికి వస్తుందా అసలు ఇందులో నటిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా బిగ్ ట్విస్ట్ ఇచ్చాడుగా మొత్తానికి అని అంటున్నారు.






