మహేష్ మూడు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్‌ను ఎంచుకున్న రాజమౌళి.. ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్

by Prasanna |
మహేష్ మూడు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్‌ను ఎంచుకున్న రాజమౌళి.. ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మహేష్ బాబు ' గుంటూరు కారం' మూవీ మంచి కలెక్షన్స్ సాధించనప్పటికి ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. సినిమా విడుదలైనప్పటి నుంచి నెగెటివ్ టాక్ వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు అందరి చూపు మహేష్ బాబు నెక్స్ట్ సినిమా పైనే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం మనకీ తెలిసిందే. ఈ మూవీ గ్లోబల్ స్థాయిలో రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రా , దీపికా పదుకొనే లాంటి గ్లోబల్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు జక్కన్న అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది.

కాగా, రీసెంట్ గా ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ బ్యూటీ నయనతార కూడా ఫిక్స్ చేసినట్టు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నాడని అందుకే ఒక్కొక్క భాషకు సంబంధించిన ఒక్కొక్క హీరోయిన్ ని ఒక్కొక్క నటులను తీసుకుంటున్నారని న్యూస్ ట్రెండ్ అవుతుంది. అయితే నయనతార సినిమాలు చేసేటప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంది, ప్రమోషన్స్ కి రానని ముందే చెబుతుంది.. రాజమౌళి ఏమో ప్రమోషన్స్ కి రాకపోతే అస్సలు ఒప్పుకోడు ..మరి అలాంటి హీరోయిన్ ని ఎలా ఎంచుకున్నడంటూ మహేష్ అభిమానులు మండిపడుతున్నారు. మహేష్ బాబు, నయన్ కాంబినేషన్లో మూడు సినిమాలు రావాల్సింది. కానీ ఈ మూడు కూడా మహేష్ బాబునే రిజెక్ట్ చేశాడట. ఆమెను మనం భరించలేము అంటూ అప్పట్లో మహేష్ బాబు ఈ సినిమాలను రిజెక్ట్ చేశాడట. మరి అలాంటి హీరోయిన్ ని మహేష్ కోసం తీసుకొస్తున్నావ్..? ఇది ఎంత వరకు కరెక్ట్..? ఎంతవరకు సక్సెస్ అవుతావు..? ఒకసారి ఆలోచించుకో అని సలహాలిస్తున్నారు..!Next Story

Most Viewed