- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న S. S. Rajamouli
టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి తన నెక్స్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేసుకుంటూనే.. ఇటు హాలిడే ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి తన నెక్స్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేసుకుంటూనే.. ఇటు హాలిడే ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా కుటుంబంతో తమిళనాడుకు రోడ్ ట్రిప్‌ను ప్రారంభించినట్లు సోషల్ మిడియాలో వెల్లడించాడు. ‘చాలా కాలంగా సెంట్రల్ తమిళనాడులో రోడ్ ట్రిప్ చేయాలని అనుకుంటున్నాను. దేవాలయాలను సందర్శించాలని నా కూతురు అనుకుంది. అందుకే మేము దీనిని ప్రారంభించాం. జూన్ చివరి వారంలో శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వరర్ కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి, మధురైకి వెళ్లాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పర్యటన నుంచి వీడియో క్లిప్స్, ఫొటోలు పంచుకోగా.. ఆయనతో పాటు భార్య రమ, కుమారుడు కార్తికేయ, కుమార్తె మయూఖా, కోడలు పూజా ప్రసాద్ కూడా జర్నీని ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోల్లో చూడవచ్చు.
Next Story






