- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిస్టరీని క్రియేట్ చేయడానికి ‘రాజా శివాజీ’ రెడీ.. జయంతి గిఫ్ట్‌గా డబుల్ అప్డేట్స్ ఇచ్చిన రితేష్!
ఈ సినిమా రితేష్ దేశ్‌ముఖ్‌కు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘రాజా శివాజీ’ రాబోతుంది.

దిశ, సినిమా: భారతీయ చరిత్రలో ధైర్యసాహసాలకు మారుపేరైన ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj)వీరగాథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు నటుడు రితేష్ దేశ్‌ముఖ్(Ritesh Deshmukh). శివాజీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పిస్తూ.. ‘రాజా శివాజీ’ (RajaShivaji )సినిమా నుంచి ఫస్ట్ లుక్, విడుదల తేదీని రితేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రితేష్ దేశ్‌ముఖ్‌కు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతుంది. అందుకే కేవలం హీరోగానే కాకుండా, ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మరాఠా సామ్రాజ్య స్థాపన, స్వరాజ్యం కోసం శివాజీ చేసిన పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రితేష్ భార్య, నటి జెనీలియా జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా మే 1న (మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది పాన్ ఇండియా లెవల్‌లో మరాఠీతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుండటం విశేషం. ఇందులో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో మెరవనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ విషయానికొస్తే.. ఇందులో రితేష్ లుక్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. చేతిలో ఒక పెద్ద కత్తి, మరో చేతిలో కాషాయ జెండా పట్టుకుని యుద్ధానికి సిద్ధమైన ఛత్రపతి శివాజీగా ఆయన కనిపిస్తున్నారు. ఆయన వెనుక సైనికులు రణరంగంలోకి దూకుతున్న ఫొటో చూస్తే సినిమాలోని యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ‘రాజా శివాజీ’పై భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్.






