- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఫిక్స్..ఎక్కడంటే ?
అమెరికాలో మాత్రం గ్రాండ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలను నిర్వహించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ లో ఉన్నారట.

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన చిత్రం "ది రాజాసాబ్". ఈ సినిమాకు దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. "ది రాజాసాబ్" సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమా జనవరి 9, 2026 రోజు సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో రిలీజ్ కానుంది. "ది రాజాసాబ్" సినిమాను రొమాంటిక్ హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించారు.
అందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో ప్లాన్ చేస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో కేవలం ప్రెస్ మీట్లతో మాత్రమే సరిపెట్టి అమెరికాలో మాత్రం గ్రాండ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలను నిర్వహించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ లో ఉన్నారట. అమెరికాలో "ది రాజాసాబ్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని అందుకోసం భారీగా బడ్జెట్ ను కేటాయించినట్లుగా తెలుస్తోంది. కాగా అమెరికాలో ఉన్న తెలుగు వారందరూ "ది రాజాసాబ్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.






