- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ‘రాజా సాబ్’ మూవీ టీమ్.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ షాకింగ్ ట్వీట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’(The Rajasaab) మూవీ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad), వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, యోగి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. రొమాంటిక్, హారర్ సినిమాగా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ మూవీ ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ జూన్ 16న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. టీజర్ లీక్ అయినట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై మూవీ టీమ్ ట్విట్టర్ ద్వారా స్పందించి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ది రాజాసాబ్ కంటెంట్ ఎవరి సోషల్ మీడియాలోనైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే అకౌంట్ సస్పెండ్ చేస్తాం. అందరూ మాకు సహకరిస్తారని అనుకుంటున్నాం. మాతో నిలబడాలని మేము అభ్యర్థిస్తున్నాము. బాధ్యతాయుతంగా జరుపుకుందాం. జాగ్రత్తగా ఉండండి’’ అని హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టారు.






