‘రాజా రాణి’కి పదేళ్లు.. అట్లీ పోస్ట్‌కు నయన్‌ లవ్‌లీ రిప్లై వైరల్

by Disha Web Desk 10 |
‘రాజా రాణి’కి పదేళ్లు.. అట్లీ పోస్ట్‌కు నయన్‌ లవ్‌లీ రిప్లై వైరల్
X

దిశ, సినిమా: యంగ్ హీరోలు ఆర్య, జై, లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రల్లో అట్లీ తెరకెక్కించిన బ్యూటీఫుల్ లవ్ అండ్ రొమాంటిక్‌ కామెడీ డ్రామా ‘రాజా రాణి’. 2013లో ఈ మూవీతోనే అట్లీ ప్రయాణం మొదలవగా ఫస్ట్ ప్రయోగమే అతనికి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. సుమారు రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా దాదాపుగా వంద కోట్ల వసూళ్లు చేయగా అట్లీ మళ్లీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. అయితే ఈ చిత్రం విడుదలై నేటితో పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రేక్షకులందరికీ థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు అట్లీ. ‘చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 ఏళ్లు కావస్తున్నా అది కల కంటే తక్కువేమీ కాదు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన నయనతార ‘అట్లీ.. ప్రౌడ్ అఫ్ యూ’ అంటూ ఆ పోస్ట్‌ను షేర్ చేయగా ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story

Most Viewed