రాజ్ తరుణ్ కోలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం..

by Mallepaka Hamsa |

రాజ్ తరుణ్ ఈ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

రాజ్ తరుణ్ కోలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం..
X

దిశ, సినిమా: రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ-తెలుగు ద్విభాషా సినిమా ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’(Gods and Soldiers) చిత్రీకరణ పూర్తైంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్(Vijay Milton) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విభిన్న ప్రదేశాల్లో విస్తృతంగా షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. భారీ స్థాయిలో, భావోద్వేగాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీ వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలతో సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. ఇందులో ఆరి అరుజునన్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. రాజ్ తరుణ్ ఈ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అమ్ము అభిరామి, కిశోర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తైన సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం అందరూ శారీరకంగా, భావోద్వేగంగా కష్టపడ్డారని అన్నారు.

Next Story