రాజ్‌తరుణ్ అమ్మాయిలను చూస్తే ఎగరేసుకుపోతాడు: జబర్దస్త్ అప్పారావు

by Dishanational2 |
రాజ్‌తరుణ్ అమ్మాయిలను చూస్తే ఎగరేసుకుపోతాడు: జబర్దస్త్ అప్పారావు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒక్కడు. చిన్న చిన్న మూవీస్‌తో అలరించినప్పటికి కూడా నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా ‘తిరగబడరా సామి’ అనే మూవీతో రాబోతున్నాడు. దర్శకుడు ఏఎస్ రవికుమార్ తెరక్కెకుతున్న ఈ సినిమాకు సంబంధించి, తాజాగా షూటింగ్ వివరాలు వెల్లడించేందుకు యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో నాకు మటన్ మస్తాన్ అనే ఒక మంచి పాత్ర ఇచ్చారు. అసలు ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. డైరెక్టర్ చెప్పినట్టే ఈ రోల్‌ చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో రాజ్ తరుణ్, మాళవిక మల్హోత్రా మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఇక రాజ్ తరుణ్ అమ్మాయిలను చూస్తే ఎగరేసుకుపోతాడు’ అని చెప్పుకొచ్చాడు అప్పారావు.

Read More: సైలెంట్‌గా పెళ్లి పనులు ప్రారంభించిన వరుణ్ తేజ్‌

Next Story