పోర్న్ ఫిల్మ్ కేసులో ఇరుక్కున్న నటి భర్త.. అవమానం తట్టుకోలేక ఆమె ఏం చేసిందో తెలుసా?

by Bhoopathi Nagaiah |

నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన మొదటి ‘UT 69’ సినిమాను జోరుగా ప్రచారం చేస్తున్నాడు.

పోర్న్ ఫిల్మ్ కేసులో ఇరుక్కున్న నటి భర్త.. అవమానం తట్టుకోలేక ఆమె ఏం చేసిందో తెలుసా?
X

దిశ, సినిమా: నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన మొదటి ‘UT 69’ సినిమాను జోరుగా ప్రచారం చేస్తున్నాడు. నవంబర్ 3న ఈ మూవీ విడుదలకాబోతుండగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు. ‘పోర్న్ ఫిల్మ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు నాపై చాలా విమర్శలు వచ్చాయి. నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. చాలా అవమానంగా అనిపించింది. మీడియా నా భార్య వెనుకే ఫాలో అవుతూ మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసింది. నా కారణంగా నా పిల్లలు, తల్లిదండ్రులు చాలా బాధను అనుభవిస్తూనే నాకు మద్దతుగా నిలిచారు. ఒక దశలో ఈ ఇష్యూ మరిచిపోవాలంటే భారతదేశం విడిచి వెళ్దామని శిల్పాశెట్టి కోరింది. అయినా నేను ఇక్కడే ఉండాలనుకున్నాను. ఎందుకంటే నా భారతదేశాన్ని నేను అమితంగా ప్రేమిస్తున్నాను’ అంటూ పలు విషయాలు గుర్తు చేసుకున్నాడు.

Next Story