కథ తెలియకపోతే నోరు మూసుకోండి.. ట్రోలర్స్‌పై శిల్పా శెట్టి భర్త

by Dishanational4 |
కథ తెలియకపోతే నోరు మూసుకోండి.. ట్రోలర్స్‌పై శిల్పా శెట్టి భర్త
X

దిశ, సినిమా : శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తొలిసారి స్పందించాడు. పోర్న్ కంటెంట్ క్రియేషన్ అండ్ షేరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. ట్విట్టర్ వేదికగా ట్రోలర్స్‌కు థాంక్స్ చెప్పాడు. స్పెక్ట్స్, క్యాప్, హుడీ, మాస్క్‌ ధరించిన బ్లాక్ అండ్ వైట్ క్లోజప్ ఫొటో షేర్ చేసిన కుంద్రా.. 'మీకు మొత్తం కథ తెలియకపోతే నోరు మూసుకోండి (If U Don't Know The Whole Story.. SHUT UP)' అంటూ క్యాప్షన్ యాడ్ చేశాడు. '#ArthurRoad జైలు నుంచి విడుదలై ఈ రోజుకు ఏడాది. న్యాయం అందజేయబడుతుంది! నిజం త్వరలో బయటపడుతుంది! శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నన్ను మరింత స్ట్రాంగ్‌గా మార్చిన ట్రోలర్స్‌కు బిగ్ థాంక్స్' అని చెప్పాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన ఓ అభిమాని.. 'స్ట్రాంగ్‌గా ఉండండి!! ఏది ఏమైనా కాలమే దీనికి సమాధానం చెప్తుంది' అని కామెంట్ చేయగా.. 'అది ఏమిటో నాకు తెలియదు కానీ నిజం బయటకు రావాలి' అని మరో ట్విట్టర్ యూజర్ వ్యాఖ్యానించాడు.

Also Read : సీతా రామం'పై కంగన రియాక్షన్.. దర్శకుడిపై కామెంట్స్

Next Story

Most Viewed