నిశ్చితార్థం తర్వాత అక్కడ కనిపించి షాకిచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. చర్చనీయాంశంగా మారిన వీడియో

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నిశ్చితార్థం తర్వాత అక్కడ కనిపించి షాకిచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. చర్చనీయాంశంగా మారిన వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జోష్’ (josh)మూవీలో ఓ పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత స్టార్ హీరోల చిత్రాల్లో మాస్ సాంగ్స్ పాడి అందరినీ ఫిదా అయ్యేలా చేశాడు. అంతేకాకుండా యూట్యూబ్‌లో పలు ప్రైవేట్ పాటలు కూడా పడిన రాహుల్ ఫుల్ వైరల్ అయిపోయాడు. అలాగే తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ‘సీజన్-3’లోనూ పాల్గొని విన్నర్‌గా కప్ గెలుచుకున్నాడు. ఇక బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’(RRR)లో నాటునాటు పాటతో రాహుల్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడనడంలో అతిశయోక్తి లేదు. ఈ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావడంతో పాటు రాహుల్ పాపులారిటీ ఊహించని విధంగా మారిపోయింది. దీంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల మెప్పుపొందాడు.

ఇక ఇటీవల సడెన్‌గా తన ప్రియురాలు హరణ్య రెడ్డి(Haranya Reddy)తో ఆగస్టు 17 నిశ్చితార్థం చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఇక ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను రాహుల్ నెట్టింట పెట్టడంతో.. అది చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ తన నిశ్చితార్ధంను ఘనంగా జరుపుకోవడంతో పాటు తన ప్రియురాలికి ఖరీదైన బహుమతి కూడా ఇచ్చి సర్‌ప్రైజ్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రాహుల్ ఇన్‌స్టా ద్వారా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో కన్యాకుమారి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిశ్చితార్థం అయిన నాలుగు రోజులకే ఇలాంటి పూజలు ఎందుకు చేశాడు.. ఏమైనా దోశాలున్నాయా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story