కాబోయే భార్యకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. ఇది నమ్మలేకపోతున్నానంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్‌గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

కాబోయే భార్యకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. ఇది నమ్మలేకపోతున్నానంటూ పోస్ట్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్‌గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ నెల 27వ తేదీ ఆయన వివాహపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వివాహ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. రాహుల్, హరిణ్య (Harinya)స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ పెళ్ళికి రావాలి అంటూ ఆహ్వానించిన సంగతే తెలిసిందే. మరికొద్ది రోజులలో వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

తాజాగా సంగీత్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుస్తోంది. ఈ సంగీత్ వేడుకలో భాగంగా రాహుల్ తనకు కాబోయే భార్య హరిణ్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. హరిణ్యకు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అంటే విపరీతమైన అభిమానమట. ఈ క్రమంలోనే రాహుల్ తన సంగీత్ వేడుకకు చాహల్‌ను ఆహ్వానించడంతో హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి. ప్రస్తుతం చాహల్‌తో కలిసి దిగిన ఫోటోలను హరిణ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ.. ఇప్పటికీ ఇది జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను ఆయన అతి పెద్ద అభిమానిని కాబట్టి, ఈ క్షణం నాకు ప్రపంచాన్నే సూచిస్తుంది.. నా హృదయం నిండిపోయింది.

పిలవగానే వచ్చినందుకు చాహల్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ఇలాంటి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినందుకు రాహుల్‌కు స్పెషల్ థాంక్స్’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ పోప్ట్ చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story