Radhika Apte: సరికొత్త అవతార్‌లో బోల్డ్ బ్యూటీ.. మెప్పిస్తుందా?

by Disha Web Desk 6 |
Radhika Apte: సరికొత్త అవతార్‌లో బోల్డ్ బ్యూటీ.. మెప్పిస్తుందా?
X

దిశ, సినిమా : డేరింగ్ బ్యూటీ రాధికా ఆప్టే బోల్డ్ క్యారెక్టర్స్‌తో మెప్పించింది. నగ్నంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళ్, హిందీ మూవీస్‌లో నటిస్తూనే వరుస వెబ్‌ సిరీస్‌లు చేస్తున్న ఆమె.. త్వరలో దర్శకురాలిగా సరికొత్త బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిపింది. నిజానికి డైరెక్టర్‌గానే కెరీర్ ప్రారంభించాలనుకున్న తాను.. యాక్ట్రెస్‌గా మారాల్సి వచ్చిందని, ఈ ఎక్స్‌పీరియన్స్‌ను సినిమాను డైరెక్ట్ చేయడంలో యూజ్ చేస్తానని చెప్పుకొచ్చింది. అంతేకాదు గత మూడేళ్లుగా స్క్రీన్‌ప్లే రైటింగ్, ఫిల్మ్ డైరెక్షన్‌లో ట్రైనింగ్ తీసుకున్నట్లు వివరించింది. అయితే ఆ తర్వాత కూడా నటిగా కొనసాగుతానని.. తన ఫస్ట్ అండ్ నెక్స్ట్ లవ్ మాత్రం సినిమాను డైరెక్ట్ చేయడమేనని తెలిపింది రాధిక.



Next Story

Most Viewed