మేము హోమ్ మేకర్స్ మాత్రమే కాదు.. బోన్ బ్రేకర్స్ కూడా

by Disha Web Desk 9 |
మేము హోమ్ మేకర్స్ మాత్రమే కాదు.. బోన్ బ్రేకర్స్ కూడా
X

దిశ, సినిమా: గృహిణి ఎల్లప్పుడూ హోమ్ మేకర్‌గానే కాదు.. బోన్ బ్రేకర్‌గా కూడా పనిచేయగలదని రాధిక ఆప్టే చెబుతోంది. ఆమె నటించిన సరికొత్త మూవీ ‘మిసెస్ అండర్ కవర్’ ఏప్రిల్ 28 న జీ5లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్ తాజాగా టీజర్ విడుదల చేశారు. కాగా ఈ టీజర్‌ను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్న రాధిక.. పగటిపూట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక గృహిణిగా, రాత్రి రహస్య గూఢచారిగా కనిపించనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఈ వీడియోకు ‘హోమ్ మేకర్ లేదా బోన్ బ్రేకర్ #NotJustAHousewife #MrsUndercover’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘రాధిక జీ ఈసారి మీ లుక్ మరింత ఆకర్షణీయంగా ఉంది. లేడీ బాస్ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ పొగిడేస్తున్నారు.

Next Story

Most Viewed