- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవర్ ఫుల్ పాత్రలో రాధిక ఆప్టే.. కొత్త సినిమాపై బిగ్ అప్డేట్ రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్!
స్టార్ నటి రాధిక ఆప్టే (Radhika Apte)ఏడాదికో సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

దిశ, సినిమా: స్టార్ నటి రాధిక ఆప్టే (Radhika Apte)ఏడాదికో సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. హిట్ ష్లాప్ అని ఆలోచించకుండా.. చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. గత ఏడాది లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సిస్టర్ మిడ్‌నైట్’ వచ్చిన ఆమె ప్రస్తుతం వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సాలీ మొహబ్బత్’(Sally Mohabbat). ఇక ఇందులో రాధిక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. టిస్కా చోప్రా(Tisca Chopra) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయం కాబోతుండటం విశేషం. ఇప్పటికే ఈ మూవీని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించి ప్రశంసలు పొందారు.
దీనిని జియో స్టూడియోస్ సమర్పణలో స్టేజ్5 ప్రొడక్షన్ బ్యానర్‌లో జ్యోతి దేశ్‌పాండే, మనీష్ మల్హోత్రా, దినేశ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ గత ఏడాది ప్రారంభించినప్పటికీ ఓ సంవత్సరం పూర్తి కావొస్తున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దీంతో అంతా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ‘సాలీ మొహబ్బత్’ థియేటర్స్‌లోకి కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు కానీ డేట్ రివీల్ చేయకుండా ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు.






