- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాక్షన్ డ్రామాతో రాబోతున్న రాశీ ఖన్నా.. డైరెక్ట్ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
రాశీ ఖన్నా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఒక విభిన్నమైన మ్యూజికల్ యాక్షన్ డ్రామాగా ఎంచుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన కెరీర్‌లో ఒక గట్టి హిట్ కోసం ఎదురుచూస్తోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆమెకు అదృష్టం అంతగా కలిసి రావడం లేదు. చివరగా హిందీలో ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రంతో హిట్ కొట్టి ఈ భామకు.. తెలుగులో భారీ అంచనాల మధ్య వచ్చిన తెలుసు కదా, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఇప్పుడు ఆమె తన ఆశలన్నీ ఓటీటీపైనే పెట్టుకుంది. రాశీ ఖన్నా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఒక విభిన్నమైన మ్యూజికల్ యాక్షన్ డ్రామాగా ఎంచుకుంది. ‘లుఖ్కే’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ క్రేజీ సిరీస్‌లో పాపులర్ ర్యాపర్ కింగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. హిమాంక్ గౌర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో పాలక్ తివారి, శివాంకిత్, లక్ష్య వీర్ శరణ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో రాశీ ఖన్నా లుక్ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని సమాచారం. పంజాబ్‌లోని ర్యాప్ మ్యూజిక్ కల్చర్, దాని వెనుక ఉన్న డ్రగ్ సిండికేట్, పగ - ప్రతీకారాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. సంగీత ప్రపంచంలోని చీకటి కోణాలను చూపిస్తూనే, పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో దీన్ని రూపొందించారట మేకర్స్. సినిమాల్లో ఆశించిన సక్సెస్ రాకపోయినా, ఈ డిజిటల్ సిరీస్ ద్వారా తన సత్తా చాటాలని రాశీ ఖన్నా గట్టి పట్టుదలతో ఉంది. ఇక ఈ భారీ వెబ్ సిరీస్ డైరెక్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కింగ్ మార్క్ మ్యూజిక్, రాశీ ఖన్నా గ్లామర్, యాక్షన్ కలగలిసిన ఈ సిరీస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రాశీ ఖన్నాకు ‘లుఖ్కే’ అయినా మంచి హిట్ ఇస్తుందని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.






