బంపర్ ఆఫర్ అందుకున్న రాశి ఖన్నా.. ‘120 బహదూర్’ సినిమాలో కీ రోల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-03 13:39:27  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా(Raashi Khanna) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

బంపర్ ఆఫర్ అందుకున్న రాశి ఖన్నా.. ‘120 బహదూర్’ సినిమాలో కీ రోల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా(Raashi Khanna) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. తెలుగులో ఈ అమ్మడు ఉస్తాద్ భగత్‌సింగ్, తెలుసు కదా వంటి చిత్రాలు చేస్తోంది. షూటింగ్స్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రాశి ఖన్నా బాలీవుడ్‌లో ఓ హిస్టారికల్ ప్రాజెక్ట్‌ ఒకే చేసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘120 బహదూర్’(120 Bahadur) అనే మూవీలో ఈ అమ్మడు కీలక పాత్రలో కనిపించనుందట. ఇందుకోసం మూవీ టీమ్ సంప్రదించగా.. స్టోరీ నచ్చడంతో నటించేందుకు గ్రీన్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar)హీరోగా నటిస్తుండగా.. రజనీశ్ ఘాయ్(Rajneesh Ghai) దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఎక్సైల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా 1962లో భారత్-చైనా మధ్య జరిగిన యుద్ధంలో ఓ కీలక ఘట్టమైన రెజాంగ్‌లా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇక ఇందులో పోరాడిన మేజర్ షైతాన్ సింగ్ జీవితాన్ని చూపించనున్నారు. దేశభక్తిని పోషించే యథార్థ గాథను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఆగస్టు 5న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల గాథలో రాశి ఖన్నా ఎలాంటి పాత్రలో నటిస్తుందా? అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.

Next Story