- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ సినిమా కోసం మరో అందాల తార..ఇక ఇద్దరితో రచ్చ రచ్చే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రాజకీయాలతో పాటు ఇటు

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రాజకీయాలతో పాటు ఇటు పరిశ్రమపై దృష్టి పెట్టి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒప్పుకున్న సినిమాలను వరుస పెట్టి చేస్తూ.. నిర్మాతలకు న్యాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh) సినిమాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రస్తుతం జరుగుతోంది.
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డేట్స్... దొరికినప్పుడు సినిమా షూటింగ్ ఫాస్ట్ గా జరుపుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీల (Sri Leela).. నటిస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో... వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని చెబుతున్నారు. గబ్బర్ సింగ్ తరహాలోనే ఈ సినిమా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.
అయితే మొన్నటివరకు శ్రీ లీల... ఒకరే హీరోయిన్ అని ప్రచారం... ఇప్పుడు మరో హీరోయిన్ కూడా లైన్ లోకి వచ్చింది. శ్రీ లీలతో పాటు పవన్ కళ్యాణ్ సరసన రాశి కన్నా ( Raasi Khanna) కూడా కనిపించబోతున్నారట. ఈ సినిమాలో రెండవ పాటలో హీరోయిన్ రాశి కన్నా కనిపించే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో రాశి కన్నాకు అవకాశం రావడం ఆమె అదృష్టమని అంటున్నారు.






