వరుస సినిమాలతో రాషా జోరు.. రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలో స్టార్ కిడ్‌తో రొమాన్స్!

by Mallepaka Hamsa |

జే శెవాక్రామణి నిర్మాణంలో రాబోతున్న ‘లగన్ లాగీ రే’ చిత్రంలో రాషా హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు టాక్.

వరుస సినిమాలతో రాషా జోరు.. రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలో స్టార్ కిడ్‌తో రొమాన్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ రాషా తడానీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అలనాటి అందాల తార రవీనా టాండన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన రాషా, తన గ్లామర్‌తోనే కాకుండా నటనతోనూ పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ అని భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు దక్కించుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ‘లైకీ లైకా’ చిత్రంలో నటిస్తోంది. అంతేకాకుండా ‘శ్రీనివాస మంగాపురం’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో ఆమె ఏకంగా ఘట్టమనేని వారసుడు జయకృష్ణ సరసన రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రానున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో పాటు రాషా మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కుమారుడు వీర్ హిరానీ వెండితెర అరంగేట్రం చేస్తున్న చిత్రంలో రాషా హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. అభిషేక్ కపూర్ పీరియడ్ డ్రామా ‘ఆజాద్’తో రాషా సినిమా ప్రయాణం మొదలైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, రాషా నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అప్పటి నుంచే బాలీవుడ్ మేకర్స్ కన్ను ఈ యంగ్ బ్యూటీపై పడింది. నటనలో ఈమె చూపిస్తున్న పరిణతి, కెమెరా ముందు ఆమెకున్న పట్టు చూసి అందరూ ఫిదా అవుతున్నారు. జే శెవాక్రామణి నిర్మాణంలో రాబోతున్న ‘లగన్ లాగీ రే’ చిత్రంలో రాషా హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు టాక్. ఒక చిన్న పట్టణంలో సాగే అందమైన ప్రేమకథలో రాషా పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోందని సమాచారం.

వీర్ హిరానీ లాంటి టాలెంటెడ్ యాక్టర్‌తో రాషా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమె కెరీర్‌కు మరో పెద్ద ప్లస్ కానుంది. ఈ మ్యూజికల్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ జూలై 2026లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. జెన్-జీ నటీమణులలో రాషా ప్రస్తుతం అత్యంత బిజీగా గడుపుతోంది. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఈ చిన్నది, భవిష్యత్తులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరడం ఖాయమనినెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తన తల్లి రవీనా టాండన్ తరహాలోనే విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు రాషా సిద్ధమవుతోన్న తీరుకు దర్శకనిర్మాతలే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారట.

Next Story