హాట్ టాపిక్‌గా మారిన ‘రాకా’ రెమ్యూనరేషన్లు.. ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారంటే?

by Mallepaka Hamsa |

‘రాకా’ మూవీ పారితోషికాలతో ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. సన్ పిక్చర్స్ ఏమాత్రం వెనకాడకుండా ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్.

హాట్ టాపిక్‌గా మారిన ‘రాకా’ రెమ్యూనరేషన్లు.. ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ‘రాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు పారితోషికాలతో ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. సన్ పిక్చర్స్ ఏమాత్రం వెనకాడకుండా ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ. 175 కోట్లు తీసుకోబోతున్నారట. సౌత్ ఇండియాలో ఒక హీరోకి ఈ స్థాయిలో పారితోషికం అందడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొణె ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమెకు రూ. 25 కోట్లు ఇస్తున్నట్లు టాక్. అంటే సౌత్ సినిమాల్లో ఒక హీరోయిన్ తీసుకుంటున్న అత్యధిక రెమ్యూనరేషన్ ఇదే కావచ్చు.

ఈ మూవీలో కేవలం దీపికా మాత్రమే కాదు.. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ భామలు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నేషనల్ క్రష్ రష్మిక ఈ చిత్రం కోసం రూ. 5 నుండి 7 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతమంది స్టార్ హీరోయిన్లను ఒక్క సినిమాలో చూపిస్తున్నారంటే.. అట్లీ ప్లాన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. కొంతమంది విమర్శలు చేసినా, అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 చివరి నాటికి థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టిగా ప్రయత్నిస్తోంది.

Next Story