- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్నేషనల్ రేంజ్‌లో ‘రాకా’ మ్యూజిక్.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సాయి అభ్యంకర్
అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఇది ఒక కొత్త సౌండింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాకా’ చిత్రం ప్రస్తుతం సినీ ప్రపంచంలో ఒక సంచలనంగా మారింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ పోస్టర్, అందులో ఆయన కనిపిస్తున్న ‘హాఫ్ బాల్డ్’ లుక్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ భారీ ప్రాజెక్ట్ గురించి సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మాట్లాడుతూ, అట్లీ విజన్ చాలా గొప్పదని కొనియాడారు. ఈ సినిమా మ్యూజిక్ కేవలం భారతీయ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రపంచ ప్రసిద్ధి చెందిన సింగర్స్, లిరిసిస్ట్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు సాయి వెల్లడించారు. "అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఇది ఒక కొత్త సౌండింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యంగా బన్నీకి ఉన్న సంగీత పరిజ్ఞానం తనను ఆశ్చర్యపరిచిందని, ఆయన సలహాలు మ్యూజిక్ కంపోజింగ్‌లో చాలా హెల్ప్ అయ్యాయని సాయి పేర్కొన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తుండటంతో సినిమా రేంజ్ పెరిగింది. హాలీవుడ్ చిత్రాలైన ఐరన్ మ్యాన్ 2, ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి సినిమాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ (VFX) నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుండటం విశేషం. విజువల్స్ పరంగా ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది. కథ విషయానికి వస్తే, అల్లు అర్జున్ ఇందులో మనిషి మరియు జంతువు పోలికలున్న ఒక హైబ్రిడ్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ విభిన్నమైన లుక్ అని, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని సమాచారం.






