ప్రేక్షకులకు బంపర్ ఆఫర్‌ ఇచ్చిన 'పీవీఆర్ సినిమా'!

by Dishanational4 |
ప్రేక్షకులకు బంపర్ ఆఫర్‌ ఇచ్చిన పీవీఆర్ సినిమా!
X

దిశ, సినిమా: దేశంలోని పాపులర్‌ మల్టీప్లెక్స్‌ చెయిన్‌ పీవీఆర్‌ సినిమా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ మల్టీప్లెక్స్‌లలో ఒక్క రోజు టికెట్లను రూ.99కే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏ సినిమా అయినా, ఏ షో అయినా కూడా అదే రేటుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆఫర్‌ ఒక్క జనవరి 20వ తేదీన మాత్రమే ఉండనుంది. సినిమా లవర్స్‌ డే సందర్భంగా ఈ ఆఫర్‌ అనౌన్స్‌ చేశారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆఫర్ అన్ని నగరాల్లో ఒకేలా ఉండదు. చంఢీగఢ్‌, పుదుచ్చేరి, పఠాన్‌కోట్‌లాంటి నగరాల్లో ఈ ఆఫర్‌ వర్తించదు. కేవలం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులో రూ.100+జీఎస్టీ వసూలు చేయనున్నారు. తెలంగాణ విషయానికి వస్తే రూ.112+జీఎస్టీతో అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి : 'సార్' నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న 'బంజారా'!



Next Story

Most Viewed