'సార్' నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న 'Banjara'!

by Dishanational4 |
సార్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న Banjara!
X

దిశ, సినిమా: తమిళ్ స్టార్ హీరో ధనుష్, వెంకీ అట్లూరి కలయికలో వస్తున్న చిత్రం 'సార్'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నాగ‌వంశీ, ఎస్‌. సాయి సౌజ‌న్య నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన 'ఆడవుంది నీవే.. ఈడ ఉంది నీవే.. నీది కానీ చోటే లేనేలేదు బంజారా' అనే గీతం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆశోక్ తేజ.. 'ఈ పాటలో జీవితం వెనుక ఉన్న వేదాంతాన్ని, జనన మరణాల మధ్య ఉన్న బతుకు బాట, దాని పరమార్థాన్ని చిత్ర కథానుసారం చెప్పే ప్రయత్నం చేశాం. భగవంతుడు మనకు ఏమీ చేయట్లేదని అనుకోవద్దు. నీకోసం ఒక స్థానం పెట్టాడు. అక్కడికి చేరుకోవటం నీ బాధ్యత అని చెప్పే పాట ఇది. ఆది శంకర తత్వాన్ని, భగవద్గీత సారాన్ని దృష్టిలో ఉంచుకుని సాహిత్యం అందించాను' అని చెప్పాడు. సంయుక్తా మీన‌న్‌ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీకి జి.వి ప్రకాష్ సంగీతం అందించగా.. తెలుగు, తమిళ భాషల్లో 2023 ఫిబ్రవరి 17న విడుదలకానుంది.



Next Story

Most Viewed