పుష్ప రాజ్ స్నేహితుడు కేశవ అరెస్ట్.. మరి ‘పుష్ప 2’ పరిస్థితి ఏంటి?

by Disha Web Desk 7 |
పుష్ప రాజ్ స్నేహితుడు కేశవ అరెస్ట్.. మరి ‘పుష్ప 2’ పరిస్థితి ఏంటి?
X

దిశ, సినిమా: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ ‘పుష్ప’తో అల్లు అర్జున్‌కు ఎంత గొప్ప పేరు వచ్చిందో.. ఆయన ఫ్రెండ్‌గా కేశవ క్యారెక్టర్‌లో నటించిన జగదీశ్‌కు కూడా అంతే గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా ఆయన ఓ మహిళ ఆత్మహత్య కేసులో అరెస్ట్ కావడం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. విచారణలో భాగంగా జగదీష్ కెరీర్ స్టార్టింగ్‌లో ఒక అమ్మాయితో షార్ట్ ఫిల్మ్‌లో నటించగా ఆమెతో పరిచయం ఏర్పడిందట. అయితే తనకు ఫేమ్ వచ్చిన తర్వాత ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడట. ఈ మధ్య ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండగా ఫొటో తీసి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడట. దీంతో తన టార్చర్ తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందట.

అయితే ‘పుష్ప 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇతడి అరెస్ట్‌తో మూవీ టీంలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇతడి షూట్ ఇంకా పూర్తి చేయాల్సి ఉందట. దీంతో అతను బెయిల్‌తో బయటకు వచ్చిన తర్వాత షూట్ జరగనుందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఇతడిని రీప్లేస్ చేస్తారంటూ కూడా మరిన్ని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరీ ఏం జరుగుతుందో.

Next Story