అదిరిపోయిన పుష్ప-2 రిలీజ్ డేట్.. పదిరోజుల పాటు జాతరే!

by Disha Web Desk 10 |
అదిరిపోయిన పుష్ప-2 రిలీజ్ డేట్.. పదిరోజుల పాటు జాతరే!
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా, సునీల్, రావు రమేష్, ధనుంజయ, యాంకర్ అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే పలు రూమర్స్ రాగా.. ఇక లేటెస్ట్‌గా ఈసినిమా విడుదల తేది ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీను వచ్చే సంవత్సరం మార్చి 22న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డేట్ దాదాపు ఖరారు అయ్యిందని.. అతి త్వరలో ఓ ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో ఎక్కువగా ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉందని టీమ్ భావిస్తోందట. ఎందుకంటే 2024 మార్చి 22 ఫ్రైడే, 23, 24 వీకెండ్, 25 న హోలీ పండుగ, 29 న గుడ్ ఫ్రైడే, 30,31 వీకెండ్ ఇలా వరుసగా పది రోజులు సెలవులు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప గాడి రూల్ చూస్తారు, అసలు తగ్గేదే లే అంటూ బన్నీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read More: ఇలాంటి కథ చేయాలంటే గడ్స్ ఉండాలి భయ్యా.. అది వరుణ్ తేజ్‌కే ఉంది..!


Next Story

Most Viewed