Akash Jagannath:పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ కొడుకు.. సంచలనంగా ఇన్‌స్టా పోస్ట్

by Chukka Sudharani |   (  Updated:2024-07-25 11:22:41  IST  )

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ గురించి తెలిసిందే.

Akash Jagannath:పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ కొడుకు.. సంచలనంగా ఇన్‌స్టా పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ గురించి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్.. ‘ఆంధ్రా పోరి’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. తర్వాత ‘మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్’ వంటి చిత్రాలు తీసినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ప్రజెంట్ మరో మూవీ అనౌన్స్ చెయ్యలేదు ఆకాశ్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్ హీరో పేరు మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేడుకగా తెలియజేశాడు.

ఈరోజు ఆకాశ్ పూరీ పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు “నా పేరులో మార్పు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆకాష్ పూరీగా ఉన్న నేను ఇప్పుడు ఆకాష్ జగన్నాథ్‌గా మార్చుకున్న’ అంటూ తెలిపాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో.. ‘కెరీర్ పరంగా ఆకాశ్ పూరీ కలిసి రాలేనట్లు ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

(Post Link Credits to Akash Puri Instagram Channel)



Next Story