13 ఏళ్ల వయసు నుంచే అంటూ ఛార్మితో రిలేషన్‌షిప్‌పై స్పందించిన పూరి జగన్నాథ్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath), హీరోయిన్ ఛార్మీ కౌర్(Charmi Kaur) తెరకెక్కించిన మూవీ ‘లైగర్’ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

13 ఏళ్ల వయసు నుంచే అంటూ ఛార్మితో రిలేషన్‌షిప్‌పై స్పందించిన పూరి జగన్నాథ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath), హీరోయిన్ ఛార్మీ కౌర్(Charmi Kaur) తెరకెక్కించిన మూవీ ‘లైగర్’ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈక్రమంలోనే వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పలు వార్తలు వచ్చాయి. అందుకే కలిపి వర్క్ చేస్తున్నట్లు పలు పుకార్లు జోరందుకుని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఛార్మీ తెలుసు. గత 20 ఏళ్ల నుంచి ఉన్న స్నేహంతో మేము కలిసి పని చేస్తున్నాము.

నేను 50 ఏళ్ల వయసున్న లేదా లావుగా ఉన్న మహిళతో కనిపిస్తే ఎవరికీ ఎటువంటి బాధ ఉండేది కాదు.. ఎలాంటి అనుమానాలు రావు. లేదా ఎవరైనా పెళ్లయిన మహిళతో ఉన్నా కూడా ఇక్కడ ఎవరికీ ఏ సమస్య ఉండదు. కానీ ఇక్కడ అందరి సమస్య ఏమిటంటే ఛార్మీ యంగ్.. పైగా ఆమెకు పెళ్లి కాలేదు. దానితో అందరూ మా మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు మారండి. పైపై ఆకర్షణలు ఎక్కువ కాలం నిలబడవు. స్నేహం మాత్రమే శాశ్వతం. మా మధ్య స్నేహం మాత్రమే ఉంది. ఇకనుంచి అయినా ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం ఆపేయండి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Next Story