బెడ్‌పైకి లాగి బట్టలు విప్పేసి పడుకోమన్నాడు: స్టార్ డైరెక్టర్‌పై వర్షిణి సెన్సేషనల్ కామెంట్స్!

by Disha Web Desk 9 |
బెడ్‌పైకి లాగి బట్టలు విప్పేసి పడుకోమన్నాడు: స్టార్ డైరెక్టర్‌పై వర్షిణి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఢీ’ షోతో హాటెస్ట్ యాంకర్‌గా బుల్లితెరపై మంచి గుర్తింపు దక్కించుకుంది వర్షిణి. ఈ బ్యూటీ తరచూ తన హాట్ ఫొటో షూట్లతో మతి పోగొట్టే పరువాలతో మెస్మరైజ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా వర్షిణి ఓ ఇంటర్వ్యూకు హాజరై కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. ‘‘నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. లాక్ డౌన్‌కు ముందు ఓ వెబ్ సిరీస్‌లో అవకాశం వస్తే ఒక హోటల్‌కు ఆడిషన్స్ కోసం వెళ్లాను. అక్కడ ఒక దర్శకుడిని కలిశాను. బాగున్నావ్. నువ్వు ఈ వెబ్‌సిరీస్‌కు బాగా సెట్ అవుతావని అన్నాడు. తర్వాత నా చేయి పట్టుకుని బెడ్ పైకి లాగి.. నా డ్రెస్ విప్పమని అడిగాడు. నేను భయపడి వెంటనే బయటకు వెళ్లాను. కారులో కూర్చొని చాలా సేపు ఏడ్చాను. నా జీవితంలో ఎదురైన చేదు అనుభవం అంటే ఇదొక్కటే’’ అంటూ వర్షిణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More: వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్



Next Story

Most Viewed