- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
స్టార్ నటుడు సత్యరాజ్(Sathyaraj), ఉదయభాను(Udaya Bhanu), వశిష్ట ఎన్ సింహా, ప్రధాన పాత్రలో నటించి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బరిక్’(Tribanadhari Barbarik)

దిశ, సినిమా: స్టార్ నటుడు సత్యరాజ్Sathyaraj), ఉదయభాను(Udaya Bhanu), వశిష్ట ఎన్ సింహా, ప్రధాన పాత్రలో నటించి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బరిక్’(Tribanadhari Barbarik). మోహన్ శ్రీవాత్సవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, సాంచీ రాయ్ కీలక పాత్రలో కనిపించారు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 29న విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ‘త్రిబాణధారి బార్బరిక్’ డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 10 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘ప్రేమ, నష్టం విడదీయరాని బంధం, తన మనవరాలిని కొనుగొనేందుకు ఓ మానసిక వైద్యుడు చేసే పోరాటం’’ అనే క్యాప్షన్ జత చేసి ఆసక్తిని పెంచారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






