ప్రస్తుత రోజుల్లో నిర్మాతలకు విలువ లేదు.. దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

నిర్మాత అంటే కేవలం ఇచ్చేవాడు మాత్రమే, మిగిలిన అందరూ తీసుకునేవాళ్లే.

ప్రస్తుత రోజుల్లో నిర్మాతలకు విలువ లేదు.. దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు(Dil Raju), ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొని నిర్మాతల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పెద్ద సినిమాలు తీయడమే కాకుండా, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్‌ను ప్రారంభించిన ఆయన, ప్రస్తుత కాలంలో నిర్మాతల పరిస్థితిని వివరించారు. ‘‘ప్రస్తుత రోజుల్లో నిర్మాతలకు విలువ లేదు. గతంలో అట్లూరీ పూర్ణచంద్రరావు వంటి నిర్మాతలు ఉండేవారు, వారికి ఉన్న విలువ వేరు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ ఒకసారి చెప్పినట్లు.. 'నిర్మాత అంటే కేవలం ఇచ్చేవాడు మాత్రమే, మిగిలిన అందరూ తీసుకునేవాళ్లే'.

ఇండస్ట్రీలో అందరూ లాభాలు ఆశిస్తారు, కానీ నష్టాలను మోసేది మాత్రం నిర్మాత ఒక్కడే" అని దిల్ రాజుఎమోషనల్ అయ్యారు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'దిల్' సినిమా గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. "నేను నిర్మాతగా మారిన మొదట్లో అట్లూరీ పూర్ణచంద్రరావు గారికి ఒక మాట ఇచ్చాను. ‘దిల్’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటే, ఆ సినిమా రైట్స్ ఆయనకు ఉచితంగా ఇస్తానని చెప్పాను. ఆయనపై ఉన్న గౌరవంతో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను" అని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story