సుధీర్‌ను నమ్మాను ఇలా చేస్తాడనుకోలేదంటూ.. ఆ హీరోకు నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్..

by Mallepaka Hamsa |

సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గోట్’(goat).

సుధీర్‌ను నమ్మాను ఇలా చేస్తాడనుకోలేదంటూ.. ఆ హీరోకు నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్..
X

దిశ, సినిమా: సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గోట్’(goat). ఇందులో దివ్య భారతి (Divya Bharati)హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్(Moghulla Chandrasekhar) నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వి, అడుకులం నరైన్, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మూవీ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, టీజర్ విడుదల చేయగా.. ఇక ఈ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత చంద్రశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘‘ఒక హీరో నా రెండు మూవీస్‌లో వేలు పెట్టాడు... వాడి పని తర్వాత చెబుతాను. అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా ఫస్ట్ మూవీ ఫిల్మ్ ఛాంబర్ దాకా వెళ్లింది. కానీ నేను మాత్రం వెళ్లలేదు. నా సినిమాకు రూ.1.6కోట్ల బడ్జెట్ అని చెప్పి.. రూ.4.8 అయ్యేలా చేశారు. మాకు ఈ విషయం చెప్పకుండానే హీరోయిన్‌ని ఎడిటింగ్‌లో 15 నిమిషాలు లేపేశారు. హీరోను డామినేట్ చేసేలా సలు సీన్స్ పెట్టారు. ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత సినిమా నుంచి డైరెక్టర్ తప్పుకున్నారు. ఇదంతా చూసిన జీవిత రాజశేఖర్‌ గారు ఊరుకుంటారా..?’’ అని చెప్పుకొచ్చారు. కానీ ఆ హీరో పేరును మాత్రం రివీల్ చేయలేదు. అయితే అతను తెలుగు హీరోని అని తెలుస్తోంది.

ప్రస్తుతం చంద్రశేఖర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. అలాగే ఆ టాలీవుడ్ హీరో ఎవరా? అనే ఆలోచనలో పడ్డారు. కాగా.. ‘గోట్’ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. త్వరలోనే ప్రకటించనున్నట్లు టాక్. అయితే ఈ టీజర్ లాంచ్‌కు డైరెక్టర్‌తో పాటు సుడిగాలి సుధీర్ డుమ్మా కొట్టారు. ఎందుకంటే గతంలో.. డైరెక్టర్ ‘గోట్’ హీరోయిన్ దివ్య భారతిని చిలుక అని సంభోధించడంతో అది కాస్త వివాదాస్పద మైంది. ఇక ఈ విషయంపై హీరోయిన్ ట్వీట్ చేయడంలో అంతా చర్చకు దారితీసింది. అంత జరుగుతున్నప్పటికీ ఈ విషయంపై సుధీర్ స్పందించకపోవడం గమనార్హం. టీజర్ లాంచ్‌కి వస్తే.. మీడియా పలు ప్రశ్నలు అడుగుతుందని భావించి రాలేదు కావచ్చని నెటిజన్లు గుసుగుసలాడుకుంటున్నారు. ఇక సుధీర్ గురించి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సుధీర్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే ఈ సినిమా చేశాను. కింది నుంచి కష్టపడి పైకి వచ్చాడు. ఎప్పుడూ లేనంత బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి, సినిమాకి న్యాయం చేస్తాడని హీరోగా సెలెక్ట్ చేశాం. ఆయన ఫ్యామిలీ, పేరెంట్స్ చాలా మంచోళ్లు. అందుకే అతను వస్తాడని నమ్మాను. సినిమాని కొన్నాళ్లు ఆపి, దాన్ని కరెక్ట్ చేసుకోడానికి టైం పట్టింది. ఈ సినిమా విషయంలో ఛాంబర్ లో ఇష్యూ నడుస్తోంది. దానిపై ఒక నిర్ణయానికి వచ్చే వరకూ నేను దాన్ని బయటకు తీసుకురాలేను. ఛాంబర్ డెసిజన్ కోసం వెయిట్ చేశాం’’ అన్నారు.

Next Story