పుట్టిన రోజు ఆయనది అయితే.. దండ నాకెందుకు: RGV కామెంట్స్

by Disha Web Desk 7 |
పుట్టిన రోజు ఆయనది అయితే.. దండ నాకెందుకు: RGV కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. తాజా పరిణామాలపై, సినిమాలపై, రాజకీయాలపై స్పందిస్తూ వివాదాన్ని సృష్టిస్తుంటాడు. అయితే.. తాజాగా వర్మ తన పైనే తానే సెటైర్ వేసుకుని ఫన్నీ ఫోస్ట్ షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతూ.. ఫన్ జనరేట్ చేస్తుంది. తాజాగా ఆర్‌జీవి నిర్మాత దాసరి కిరణ్ బర్త్‌డే వేడుకలకు హాజరయ్యాడు. అక్కడ వర్మను పెద్ద పూల దండ వేసి సత్కరించారు. దీనిపై వర్మ ఫన్నీగా స్పందిస్తూ ''మా ''వ్యూహం'' ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారి బర్త్‌డే అయితే నాకెందుకు దండేశారో నాకర్ధం కాలేదు.. వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే టు దాసరి కిరణ్ కుమార్'' అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Next Story

Most Viewed