Manipur Violence : ఆ వీడియో మొత్తం చూడలేక సిగ్గుతో తలదించుకున్నాం: మణిపూర్ ఘటనపై ప్రియాంక ఎమోషనల్ పోస్ట్

by Phanindra |   (  Updated:2023-07-21 10:16:29  IST  )

మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై ప్రియాంక చోప్రా స్పందించింది.

Manipur Violence : ఆ వీడియో మొత్తం చూడలేక సిగ్గుతో తలదించుకున్నాం: మణిపూర్ ఘటనపై ప్రియాంక ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై ప్రియాంక చోప్రా స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఇష్యూకు సబంధించిన వివరాలను తెలియజేస్తూ క్రూరమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ‘ఆ ఘోరం జరిగిన 77 రోజుల తర్వాత ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు. దేనితో సంబంధం ఉన్నా.. లేకపోయినా మేము ఏ ఆటలోనూ మహిళలను ఇలా బంటులుగా అనుమతించలేము. ఈ సామూహిక అవమానంపై కోపాన్ని, అన్యాయాన్ని ఇప్పుడు ఏకీకృత స్వరంతో ప్రసారం చేయాల్సిన అవసరం ఉంది. సత్వర న్యాయం కావాలి. #justice for the women of Manipur’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది పీసీ. అలాగే ‘నేను చాలా బాధపడ్డాను. మొత్తం వీడియోను చూడలేకపోయా. చాలా సిగ్గుపడ్డాను. దీనిపై ఇన్నాళ్లు ఎవరూ సానుభూతితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నన్ను చాలా నిరుత్సాహపరిచింది’ అంటూ జయా బచ్చన్ చెప్పుకొచ్చింది.

Read more : disha newspaper

Movie News & Gossips


Next Story