హాట్ టాపిక్‌గా మారిన ప్రియాంక మోహన్ బోల్డ్ ఫొటోస్.. దయచేసి వాటిని షేర్ చేయొద్దంటూ వార్నింగ్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఇటీవల ‘ఓజీ’(OG) సినిమాతో వచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

హాట్ టాపిక్‌గా మారిన ప్రియాంక మోహన్ బోల్డ్ ఫొటోస్.. దయచేసి వాటిని షేర్ చేయొద్దంటూ వార్నింగ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఇటీవల ‘ఓజీ’(OG) సినిమాతో వచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), సుజిత్(Sujith) కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక మోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమ్మడుకి సంబంధించిన కొన్ని బోల్డ్ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అందులో ఆమె సెక్సీగా ఉండి రెచ్చగొట్టేలా తన అందాలను చూపిస్తూ హీట్ పుట్టిస్తోంది.

ఇక వాటిని చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇవి కాస్త ప్రియాంక మోహన్ కంటపడటంతో.. ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘‘నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు కొన్ని ఏఐ జనరేటెడ్ ఫొటోలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి వాటిని షేర్ చేయడం ఆపేయండి. ఏఐ సైతిక సృజనాత్మకత కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి తప్పుడు సమాచారం కోసం కాదు. మనం ఏమి క్రియేట్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి.

ఎలాంటి వాటిని ఇతరులతో పంచుకుంటున్నాం అనేదాని గురించి జాగ్రత్తగా ఉండండి.. అందరికీ ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ప్రియాంకకు సపోర్ట్‌గా నిలుస్తు్న్నారు. కాగా.. ఈ ఫొటోలు ‘ఓజీ’ సినిమాలోని సువ్వి.. సువ్వి సాంగ్ కాస్ట్యూమ్‌లో ఉన్నవని తెలుస్తోంది. దీనిని అదునుగా తీసుకున్న నెటిజన్లు కొందరు ఏఐ సాయంతో మరింత నీచంగా క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. హీరోయిన్లకు ఇలా కావడం ఇదేమి మొదటి సారి కాదు. ఏఐ వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఇలా ఇబ్బంది పడినవారే.

link

Next Story