చీరకట్టులో చందమామలా మైమరిపిస్తున్న ప్రియాంక మోహన్..(పోస్ట్)

by Dishafeatures1 |
చీరకట్టులో చందమామలా మైమరిపిస్తున్న ప్రియాంక మోహన్..(పోస్ట్)
X

దిశ, సినిమా: తెలుగులో హీరో నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో నటించిన ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో తన నటనతో కుర్రకారులో చెరగని చోటు సంపాదించుకుంది. అలాగే తెలుగులో శ్రీకారం, రావణాసుర సినిమాల్లో కూడా నటించింది.

ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో కూడా చాలా సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అనే మూవీలో నటిస్తుంది. హీరో నాని నటిస్తున్న ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. సరిపోదా శనివారం 2024 ఆగస్టు 29న , తెలుగు భాషలో, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లతో థియేటర్లలో విడుదల కానుంది.

అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇందులో నల్లని చీర కట్టుకొని తన వాలు కళ్ళతో వయ్యారంగా చూస్తున్నది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు దేవతకి రూపం ఉంటే అది నువ్వే చెలి అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ అందాన్ని మీరు కూడా చూసి తరించండి.

Read More...

చైతుకి గోరు ముద్దలు పెడుతున్న సాయి పల్లవి.. ఎంత ముద్దుగా ఉన్నారో ఇద్దరు..(వీడియో)


Next Story

Most Viewed