ఆ కారణంతోనే మేము సరోగసీని ఎంచుకున్నాం: Priyanka Chopra

by Chukka Sudharani |   (  Updated:2023-01-20 13:13:54  IST  )

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సరోగసీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో వెల్లడించింది.

ఆ కారణంతోనే మేము సరోగసీని ఎంచుకున్నాం: Priyanka Chopra
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సరోగసీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో వెల్లడించింది. 'నిజానికి నాకు వైద్యపరమైన సమస్యలున్నాయి. విమర్శలకు దారితీస్తుందనే పరిస్థితుల కారణంగా ఈ విషయాన్ని చాలా కాలం ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడ్డాం. ఇది జీవితంలో అత్యంత కీలకమైన దశ. మీకు నా గురించి పూర్తిగా తెలియదు.

నేను ఏం అనుభవించానో తెలియదు. కారణాలు ఏమైనప్పటికీ సరోగసీ ప్రయాణం గురించి ప్రజలతో చర్చించాలని ఫిక్స్ అయ్యా. నా గురించి తప్పుగా మాట్లాడిన పట్టించుకోను. కానీ మా కూతురు గురించి మాట్లాడితేనే బాధగా ఉంటుంది. దయచేసి ఆమెపై ట్రోలింగ్ మానేయండి. ఆ చిట్టి చేతులను పట్టుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో నాకే తెలుసు' అని చెప్పుకొచ్చింది.


Next Story