న్యూయార్క్‌లో దీపావళి సెలవులు.. Priyanka Chopra ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2022-10-23 12:28:03  IST  )

Priyanka Chopra Jonas celebrates as New York declares Diwali as public school holiday from 2023

న్యూయార్క్‌లో దీపావళి సెలవులు.. Priyanka Chopra ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా : న్యూయార్క్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు దీపావళి సెలవు ప్రకటించడంపై ప్రియాంక స్పందించింది. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి దీపావళికి గవర్నమెంట్ స్కూల్స్‌కు సెలవులు అని న్యూయార్క్ నగర మేయర్ ప్రకటించిన వీడియోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీపోస్ట్ చేసింది. 'ఇన్ని సంవత్సరాల తర్వాత! క్వీన్స్‌లో నివసిస్తున్న నా యుక్తవయస్సు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. #representationmatters' అని క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఈ విషయంపై స్పందించిన ఆమె.. 'ఈ రోజు మా సమయం వచ్చిందని చెప్పడానికి గర్వపడుతున్నా. దీపావళి పండుగను జరుపుకునే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన 2లక్షల మందికి పైగా న్యూయార్క్ వాసులను గుర్తించినందుకు ఆనందంగా ఉంది' అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఇందుకు సబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. గర్వంగా ఫీల్ అవుతున్నామంటూ ఇండియన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : క్రిమినల్ జస్టిస్.. న్యాయం కాదు సంపాదనే పరమావధిగా లాయర్స్

Next Story