- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ మద్దతు, ప్రేమతోనే ఇంతటి గుర్తింపు.. ప్రియాంక ఎమోషనల్
మూడేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ముంబైలో తెగ ఎంజాయ్ చేసింది.Latest Telugu News

దిశ, సినిమా : మూడేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ముంబైలో తెగ ఎంజాయ్ చేసింది. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, సహ నటులు, అభిమానులను కలుస్తూ అలరించిన నటి.. తన సొంత ఇంటిని విడిచి మళ్లీ యూఎస్ వెళ్లాలని లేదంటూ ఎమోషనల్ అయింది. అలాగే ముంబైలో హెయిర్ కేర్ బ్రాండ్‌ను ప్రచారం చేసే ఈవెంట్‌కు సిద్ధమైనప్పుడు తన మేకప్ రూమ్ లోపల చిత్రించిన వీడియోను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ సుధీర్ఘమైన క్యాప్షన్ రాసుకొచ్చింది. 'ఇంట్లో ఉండటం చాలా ఆనందంగా ఉంది. బాబుల్ నాథ్, చర్చ్‌గేట్‌ని చూడటం మరింత సంతోషానిచ్చింది. గత రెండు రోజులుగా నాపై చూపిన ప్రేమ, మద్దతుతో నా మనసు కదిలిపోయింది. మీరందరితో పాటు నా బృందం లేకుంటే నేను ఎక్కడ ఉండేదాన్నో తెలియదు. ఈ విషయాన్ని నిజాయితీగా చెప్పగలను. మళ్లీ మీ వద్దకు తిరిగి వచ్చే వరకు వేచి ఉండలేను. మనం మళ్లీ కలుసుకునే వరకు... అల్విదా (గుడ్ బై)' అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
- Tags
- Priyanka chopra






