- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియమణి 'భామా కలాపం' రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ సీన్ మొత్తం రివర్స్..

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం తనదైన శైలిలో సినిమాలు చేస్తోంది. తాజాగా ప్రియమణి నటించిన సినిమా 'భామా కలాపం'. ఈ సినిమాలో యూట్యూబ్ చెఫ్‌గా ప్రియమణి దర్శనమిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ప్రియమణి ఏం వండనుంది, ఏం వడ్డించనుందంటూ నెటిజన్లలో ఆసక్తి రేగింది. అయితే తాజాగా ప్రియమణి ఎప్పుడు వడ్డించనుందో మేకర్స్ డిసైడ్ చేసేశారు. 'భామా కలాపం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
ఈ డేట్‌ను టీజర్‌తో ప్రకటించారు. ఈ టీజర్‌లో ప్రియమణిని అనుపమగా అందరికీ పరిచయం చేశారు. అంతేకాకుండా ఎప్పుడూ ఇరుగుపొరుగువారి విషయాల్లో తలదూర్చే పాత్ర అనుపమ. పక్కనోళ్ళ గురించి తెలుసుకుంటేనే ఆనందం ఉంటుంది అనే వ్యక్తిత్వం అనుపమది. అయితే ఇదంతా ఒక్కసారిగా ఓ మర్డర్ మిస్టరీగా మారిపోతుంది. పోలీసుల ఎంట్రీతో అంతా సీన్ రివర్స్ అయిపోతుంది. ఇందులో నుంచి అనుపమ ఎలా తప్పించుకున్నదన్నదే కథ. ఈ వెబ్ మూవీ వచ్చే నెల ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమ్ కానుంది. మరి ఈ వెబ్ మూవీతో ప్రియమణి ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.






