- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) ‘ఒరు అదార్ లవ్’ మూవీతో వచ్చి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) ‘ఒరు అదార్ లవ్’ మూవీతో వచ్చి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. ఇక ఇటీవల జాబిలమ్మ నీకు అంత కోపమా, గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కొల్లా’. 2023లో విడుదలైన ఈ పినిమా విజయం సాధించింది. రిలీజ్ అయిన రెండేళ్ల తర్వాత ఈ సినిమా తెలుగు భాషలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. తాజాగా, ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సూరజ్ వర్మ(Suraj Verma) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజిషా విజయన్, కొల్లం సుధి, షేబిన్ బెన్సన్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇక ఇందులో బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఓ ఇద్దరు అమ్మాయిలు హత్యలు చేస్తారు. ఎన్ని ట్విస్టులు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో ఉంది ట్రైలర్. పోలీసులు కేసు నమోదు చేసి ఎక్వైరీ చేస్తుండగా.. హీరోయిన్లు తప్పించుకుంటూ వారికి దొరకకుండా మరిన్ని హత్యలు చేస్తారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఈ సినిమా జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది.






