బాలీవుడ్‌పై కన్నేసిన ప్రియా ప్రకాష్ వారియర్.. అదృష్టం కలిసొచ్చేనా?

by Mallepaka Hamsa |

‘ఒరు ఆధార్ లవ్’ (Oru Aadhaar Love)లవ్ సినిమాలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి..చేతి వేళ్లతో షూట్ చేసే సీన్‌తో ఫుల్ పాపులారిటినీ సొంతం చేసుకుంది ఈ మలయాళ భామ.

బాలీవుడ్‌పై కన్నేసిన ప్రియా ప్రకాష్ వారియర్.. అదృష్టం కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: ‘ఒరు ఆధార్ లవ్’ (Oru Aadhaar Love)లవ్ సినిమాలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి..చేతి వేళ్లతో షూట్ చేసే సీన్‌తో ఫుల్ పాపులారిటినీ సొంతం చేసుకుంది ఈ మలయాళ భామ. మొదటి చిత్రంతోనే యూత్ కలల రాణిగా మారిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో పలు మూవీస్ చేసి తన ఫేమ్‌ను మరింత పెంచుకుంది. ఇటీవల ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫుల్ జోష్‌తో ఉన్న ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier).. ప్రజెంట్ బాలీవుడ్‌ ఇండస్ట్రీపై కన్నేసింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటించనుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో లేదా.. వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతో పాటు ప్రియా ‘3 మంకీస్’(3 Monkeys)లోనూ అవకాశం దక్కించుకుంది. అబ్బాస్ మస్తాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రియా ప్రకాష్ ఈ రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా ఆమె బాలీవుడ్‌లో సెటిల్ అవడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story