ఏడేళ్లుగా పృథ్వీరాజ్ సుకుమారన్ భార్యకు వేధింపులు.. ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న పోస్ట్

by Mallepaka Hamsa |

సాధారణంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతుంటారు.

ఏడేళ్లుగా పృథ్వీరాజ్ సుకుమారన్ భార్యకు వేధింపులు.. ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: సాధారణంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతుంటారు. అలాగే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కూడా ఉన్నట్లు తమకు కూడా ఎదురైనట్లు పలువురు నటీమణులు పలు సంచలన విషయాలను రివీల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ స్టార్ హీరో భార్య ఏడేళ్లుగా వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) భార్య సుప్రియ మేనన్(Supriya Menon) ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్న తెలిపింది. ‘‘2018 నుంచి ఈ మహిళ నాకు తెలుసు.

తనకు చిన్న పిల్లాడు ఉన్న కారణంగా నేను ఇన్ని రోజులు ఆమెపై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నా తండ్రిపై కూడా నిందలే వేస్తూ కామెంట్స్ చేస్తోంది. ఆయన ప్రస్తుతం భౌతికంగా మా మధ్య లేకపోయినప్పటికీ నిందలు వేస్తోంది. నేను ఎన్నోసార్లు ఆమె ఖాతాను బ్లాక్ చేసినప్పటికీ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మరీ దారుణంగా కామెంట్లు పెడుతోంది. నన్ను బాధపెట్టడమే ఆమె పనిగా పెట్టుకుంది.ఆమె క్రియేట్ చేసుకున్న ప్రతి ఖాతాను బ్లాక్ చేయడం నా నిత్య జీవితంలో భాగమైంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సుప్రియకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.


Next Story