Samantha and Vijay Deverakonda : సమంత చేసిన పనికి ఇబ్బంది పడుతున్న విజయ్

by Phanindra |   (  Updated:2023-07-11 06:47:32  IST  )

‘లైగర్’ మూవీ డిజాస్టర్‌తో కోలుకోలేని దెబ్బ తిన్నాడు విజయ్ దేవరకొండ.

Samantha and Vijay Deverakonda : సమంత చేసిన పనికి ఇబ్బంది పడుతున్న విజయ్
X

దిశ, సినిమా: ‘లైగర్’ మూవీ డిజాస్టర్‌తో కోలుకోలేని దెబ్బ తిన్నాడు విజయ్ దేవరకొండ. దీంతో తన రాబోయే చిత్రాలైనా ప్రేక్షకులు ఈ డిజాస్టర్‌ని మర్చిపోయేలా ఉండాలని నానా తిప్పలు పడుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రజెంట్ తన ఫోకస్ అంతా ‘ఖుషి’ మూవీ‌పై పెట్టాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. అంతా బాగానే ఉప్పప్పటికీ మేకర్స్ మాత్రం మూవీ ప్రారంభమైనప్పటి నుంచి సమంతవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మూవీ రిలీజ్‌డేట్ దగ్గర పడుతున్న క్రమంలో.. సమంత మాత్రం ఒక సంవత్సరం విరామం తీసుకుంటానని షాక్ ఇచ్చింది. అంటే మూవీ ప్రమోషన్స్‌‌ సమయంలో ఆమె అందుబాటులో ఉండదన్నమాట. ఈరోజుల్లో ప్రమోషన్స్ చేస్తేనే జనాలు థియేటర్‌కి వెళ్తున్నారు. మరి ఎలాంటి హడావిడి లేకుండానే రిలీజ్ అంటే హిట్ కొట్టడం కొంచెం కష్టమే చెప్పాలి.

Read More: Game Changer : 'గేమ్ ఛేంజర్' నయా షెడ్యూల్ అప్పుడేనా..!

Next Story